ప్రముఖ తమిళ నటుడు ప్రభు కుమార్తెతో అదిక్ రవిచంద్రన్ పెళ్లి ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా తమిళ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య అధిక్ రవిచంద్రన్ తో ప్రేమలో ఉన్నట్లు గతంలోని వార్తలొచ్చాయి. డిసెంబర్ 15 శుక్రవారం ఉదయం అదిక్ రవిచంద్రన్, ఐశ్వర్య ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వివాహానికి హాజరై తమ శుభాకాంక్షలు అందజేశారు. ఇక ఈ వివాహ వేడుకలో విశాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

 అదిక్ రవిచంద్రన్ ఐశ్వర్యల వివాహానికి హాజరైన విశాల్ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్చేశాడు." మై డార్లింగ్ అదిక్, నా సోదరి ఐశ్వర్య కు హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభిస్తున్న మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అధిక్.. నా సోదరిని ఒక యువరాణిలా చూసుకో" అంటూ విశాల్పే ర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కొత్త జంటకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా 2015 లో విడుదలైన 'త్రిష ఇల్లాన నయనతార' అనే సినిమాతో దర్శకుడిగా మారిన అదిక్ రవిచంద్రన్ 'దబాంగ్ 3' తమిళ వెర్షన్ కి డైలాగ్స్ రాశారు. 

ఇక ఏడాది విశాల్ తో తెరకెక్కించిన 'మార్క్ ఆంటోనీ' మూవీతో దర్శకుడిగా మొదటి విజయాన్ని అందుకున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కోలీవుడ్ లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. త్వరలోనే కోలీవుడ్ స్టార్ అజిత్ తో సినిమా చేయబోతున్నాడు. ఇక ఐశ్వర్య విషయానికి వస్తే.. తమిళనటుడు ప్రభు కుమార్తె అయిన ఈమెకి గతంలోనే పెళ్లి జరిగింది. కునాల్ అనే యువకుడుతో 2009లో ఈమె వివాహం జరగకగా.. కొన్ని ఏళ్లకే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి  వీరి బంధం విడాకులతో ముగిసింది. ఆ తర్వాత ఐశ్వర్య తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటుంది. గత కొద్ది నెలలుగా దర్శకుడు అధిక రవిచంద్రన్ తో ఐశ్వర్య రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: