టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం.. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు 28 వ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా నుంచి ఏదైనా ట్రైలర్ అప్డేట్ రావాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా థియేటర్ ట్రైలర్ ని జనవరి 6వ తేదీన వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది..గుంటూరు కారం సినిమాలో హీరోయిన్స్ గా శ్రీ లీల ,మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత నాగ వంశీ నిర్మిస్తూ ఉండడం గమనార్హం. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ అందిస్తూ ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం.. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పలు రకాల పోస్టర్స్ లో మహేష్ బాబుని అభిమానులు ఎలా అయితే చూడాలను కుంటున్నారో ఆ విధంగానే ఎలివేషన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి.


గతంలో మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం పై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి ఏ మేరకు ఎలాంటి రికార్డులను సైతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో చేస్తారో చూడాలి మరి. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఒక నెల  గ్యాప్ తీసుకొని రాజమౌళితో  తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు చేయబోతున్నారు ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు తన డేట్ లను ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: