లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార పారితోషికం లీక్‌ అయ్యింది. ఆమె సౌత్‌లోనే హైయ్యెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ గా నిలిచింది. ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేసన్‌ తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం.లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌తో రాణిస్తుంది నయనతార. అతి తక్కువ మంది హీరోయిన్లకి మాత్రమే ఈ ట్యాగ్‌ వర్తిస్తుంది. ఒకప్పుడు సావిత్రి, ఆ తర్వాత శ్రీదేవి, విజయశాంతి వంటి వారు మాత్రమే ఇలాంటి ట్యాగ్‌లకు అర్హులు అనేలా రాణించారు. సినిమాలతో, అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇప్పుడు నయనతార లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తుంది. ఆమెకి పెళ్లైన తర్వాత ఆ క్రేజ్‌ మరింత పెరుగుతుంది. ఆమె చేస్తున్నసినిమాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
నయనతార.. ఓవైపు కమర్షియల్‌ సినిమాలతోపాటు మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. గ్లామర్‌ విషయంలో హద్దులు చెరపకుండా తన హుందాతనాన్ని చూపిస్తుంది. మరోవైపు యాక్షన్‌ తోనూ అదరగొడుతుంది. మొన్న `జవాన్‌`లో ఆమె యాక్షన్‌ సీన్స్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే. మరోవైపు తాను నటించే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ యాక్షన్‌ సీక్వెన్స్ లతో అలరిస్తుంది.

 స్టార్‌ హీరోల రేంజ్‌లో నయనతార సినిమాలు థియేటర్లలో ఆదరణ పొందుతుంటాయి. మంచి కలెక్షన్లు రాబడుతుంటాయి. అందుకే ఆమెని లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలుస్తుంటారు అభిమానులు. అయితే ఇటీవల ఈ అమ్మడు చేసిన సినిమాలేవి వర్కౌట్‌ రావడం లేదు. ఒక్క జవాన్‌ తప్పితే మిగిలిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. ఈ మూడేళ్లలో దాదాపు పదమూడు సినిమాలు చేసింది నయనతార. అందులో జవాన్‌ మాత్రమే సక్సెస్‌ అయ్యింది.నయనతార ఇటీవల నటించిన గాడ్‌ ఫాదర్‌, మలయాళంలో చేసిన గోల్డ్,తమిళంలో నటించిన కనెక్ట్, కాథువాకు రెండు కాదల్‌, రజనీకాంత్‌ అన్నాత్తే, నెట్రికన్‌, నిజల్‌, ఆరడుగుల బుల్లెట్‌, ఇరైవన్‌, అన్నపూరని సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. కానీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన జవాన్‌ సినిమా మాత్రమే బంపర్‌ హిట్‌ అయ్యింది. ఆ సినిమా క్రెడిట్‌ కూడా షారూఖ్‌ ఖాతాలోకి వెళ్తుంది. అయినా నయనతార క్రేజ్‌కి మాత్రం ఏమాత్ర ఢోకా లేదు.

 నయనతార తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. హిట్‌, ఫ్లాపులతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్‌ అందుకుంటుంది. తాజాగా ఆమె పారితోషికం లీక్‌ అయ్యింది. ఆమె ఒక్కో సినిమాకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ వింటే మాత్రం ఫ్యూజులు ఔట్‌ అయ్యే పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆమె ఏకంగా 12కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందట. పాత్ర నిడివి, ప్రయారిటీని బట్టి ఆమె పది నుంచి 12కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని సమాచారం.ఇది సౌత్‌ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్‌ అని చెప్పాలి. కాజల్‌, అనుష్క, తమన్నా, రకుల్‌, త్రిష, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, కీర్తి సురేష్‌ వంటి మరే ఇతర హీరోయిన్‌ పారితోషికం అయినా నాలుగు కోట్లకు మించి లేదు. `యానిమల్‌`తో రష్మిక కాస్త పెంచిందని సమాచారం. అలాగే సమంతకి ఐదు వరకు ఇస్తున్నారని అంటున్నారు. ఈ లెక్కన సౌత్‌లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌ అందుకుంటున్న హీరోయిన్‌గా నయనతార నిలిచిందని చెప్పొచ్చు. నార్త్ లో దీపికా పదుకొనే, అలియాభట్‌ వంటి కథానాయికలు మాత్రమే ఈ పారితోషికాన్ని అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: