ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీ గా ఉన్నటువంటి అనసూయ వ్యక్తిగత జీవితం లో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈమె తనకు ఏమాత్రం వీలు దొరికిన ప్రతిసారి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లడం లేదంటే దైవ దర్శనాలకు వెళ్లడం జరుగుతుంది. అయితే తాజా గా ఈమె కుటుంబ సభ్యుల తో కలిసి పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాల లో పాల్గొని ఆధ్యాత్మిక చింతన లో గడిపారని తెలుస్తోంది.
ఇలా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఈ పూజ కు సంబంధించినటు వంటి ఫోటోలను షేర్ చేయడం తో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ఈమె శ్రీకాళహస్తిలోని ,శివుడి ఆలయం లో ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారని తెలుస్తోంది.ఆలయ అర్చకులు ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. అనంతరం అనసూయ కూడా ఆలయం లో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలను తీర్థప్రసాదాలను అనసూయకు పండితులు అందజేశారు. ఇక ఆలయంలో అనసూయ దిగినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఈమె సంప్రదాయబద్ధంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి