టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమా పూర్తి అవ్వగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ మరొక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే RC -16 అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి ఫ్రీ అవ్వగానే రెగ్యులర్ గా ఈ సినిమా షూటింగ్ వచ్చేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


సినిమా కథ మొత్తం కూడా ఒక విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండబోతోందని పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.. మ్యూజిక్ ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారనే విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా RC -16 రేంజ్ మారిపోయింది.. ఇప్పుడు మరొకసారి ఈ సినిమా హైప్ ని పెంచుతూ జైలర్ సినిమా స్టార్ని ఇందులో జాయిన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. జైలర్ సినిమాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ నటుడు శివ రాజకుమార్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు..


జైలర్ చిత్రంలో కేవలం నడుచుకుంటూ వచ్చి ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన నటుడు శివరాజ్ కుమార్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.. శివరాజ్ కుమార్ పాన్ ఇండియా క్రేజ్ భారీగా ఏర్పడింది.ఇప్పుడు ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే రామ్ చరణ్ బుచ్చిబాబు చిత్రంలో కూడా తను నటించే అవకాశం ఎక్కువగా ఉందని అందుకు సంబంధించి డిస్కషన్ కూడా జరుగుతున్నదని త్వరలోనే అందుకు సంబంధించి విషయాన్నీ కూడా తెలియజేస్తానని తెలిపారు శివరాజ్ కుమార్.. తన పాత్ర కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ రోలు ఉందని చెప్పగానే అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: