పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అనేక సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే ఈయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.

మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకొని అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను పవన్ అందుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలను అందుకోలేక పోయినప్పటికీ ఆయన ఆ సినిమాలో వేసిన డ్రెస్సింగ్ స్టైల్ తో , అలాగే ఆయన సినిమాలో చేసిన పర్ఫామెన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల పరంగా అభిమానులను నిరాశ పరిచినప్పటికీ సినిమాలో అద్భుతంగా కనిపించి ప్రేక్షకులను ఎంతో అలరించిన పవన్ సినిమాలలో బాలు ఒకటి.

మూవీ కి కరుణ కరణ్ దర్శకత్వం వహించగా ... శ్రేయ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇకపోతే ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ 2005 వ సంవత్సరం జనవరి 6 వ తేదీన విడుదల అయింది. నేటితో ఈ సినిమా విడుదల అయ్యి 19 ఏళ్లు పూర్తయింది. ఇకపోతే పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: