సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రాలలో జైలర్ కూడా ఒకటి.. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. 2023లో ఈ సినిమా కోలీవుడ్ లోనే బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. ఎన్నో ఏరియాలలో ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.. అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్ తీయడానికి చిత్ర బృందం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


జైలర్ సినిమాతో బ్లాక్ బాస్టర్ రియంట్రీ ఇచ్చిన రజనీకాంత్ అభిమానులను ఫుల్ ఖుషి చేశారు. ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది జైలర్ మూవీ.. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. గత ఏడాది సౌత్ ఇండియన్ లో బిగ్గెస్ట్ గ్రాఫర్ చిత్రంగా కూడా నిలిచిన జైలర్ సినిమా రికార్డు బద్దలు కొట్టాలని లియో సలార్ మూవీస్ కూడా ప్రయత్నించగా ఆ బెంచ్ మార్కును దాటలేకపోయాయని తెలుస్తోంది.


జైలర్ సీక్వెల్ పైన డైరెక్టర్ నెల్సన్ ఆల్రెడీ పనులు మొదలు పెట్టారని.. ఈ సినిమా కు రజనీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో వచ్చే ఏడాది కచ్చితంగా ఈ సినిమా ప్రాజెక్టుని మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ డైరెక్టర్ జ్ఞానబెల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వేసవిలో డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో ఒక సినిమాని చేయబోతున్నారు. ఇవే కాకుండా డైరెక్టర్ సెల్వరాజుతో ఒక సినిమా కూడా లైన్లో ఉండడంతో ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమాలు మొత్తం సెట్స్ పైకి వెళ్తాయి.. అలా ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాతనే జైలర్-2 చిత్రం ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: