వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి వచ్చి థియేటర్స్ లో ఒక రేంజ్ లో సందడి చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల సినిమా వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి.అమ్మ సెంటిమెంట్ తో అలాగే మాస్ కమర్షియల్ అంశాలతో పండక్కి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ఎంతగానో మెప్పిస్తుంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సినిమా హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.ఈ సంక్రాంతి పండగకి మరో మూడు సినిమాలు ఉన్నా గుంటూరు కారం సినిమా మాత్రం కలెక్షన్స్ లో మంచి జోరు చూపిస్తుంది. ఇక గుంటూరు కారం సినిమా మొదటి రోజు ఏకంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా రెండో రోజుకి అది 127 కోట్లకు చేరింది. ఇక మూడో రోజు దాదాపు 37 కోట్లు కలెక్ట్ చేసి గుంటూరు కారం సినిమా మొత్తంగా మూడు రోజుల్లో ఏకంగా 164 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. 


ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.ఇంకా సంక్రాంతి హాలీడేస్ జనవరి 18 దాకా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. గుంటూరు కారం సినిమా సంక్రాంతి సెలవలు ముగిసేలోపు ఖచ్చితంగా 260  కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అభిమానులు, ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఇక సంక్రాంతి పండగ సెలవులు కావడంతో ఫ్యాన్స్ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ బాబు సినిమా కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు నమోదు చేస్తుందో చూడాలి. వసూళ్లు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికే 60 శాతం పైగా రికవరీ చేసింది.ఇప్పటిదాకా ఈ సినిమాకి 85 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 133 కోట్ల షేర్ రాబట్టాలి.ఇంకా 48 కోట్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: