ఈ సంక్రాంతి పండగకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించింది.ఇప్పటి దాకా ఇప్పటికే ఆల్మోస్ట్ 190 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది గుంటూరు కారం సినిమా.ఇంకా కొన్ని రోజులు సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీలు భారీగా థియేటర్స్ కి వెళ్తున్నారు. నెగటివ్ టాక్ తో స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా ఇప్పుడు సూపర్ సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.అందుకే తాజాగా గుంటూరు కారం సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే కేవలం కొంతమంది మాత్రమే ప్రైవేట్ పార్టీలాగా చేసుకున్నారు.నిన్న సంక్రాంతి పండుగ  కావడంతో చిత్రయూనిట్ సూపర్ స్టార్ మహేష్ ఇంట్లో మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సెలబ్రేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ, దిల్ రాజు ఫ్యామిలీ, నాగవంశీ, శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు.


మహేష్, శ్రీలీల, నమ్రత ఈ సక్సెస్ పార్టీ నుంచి ఫోటోలు తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. మొత్తానికి మహేష్ ని చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఈరోజు కూడా ఈ సినిమాకి చాలా స్ట్రాంగ్ బుకింగ్స్ అయ్యాయి. ఈ సినిమా ఇప్పటిదాకా 100 కోట్ల పైగా షేర్ వసూళ్లు రాబట్టింది. అలాగే భీంలా నాయక్, అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల క్లోసింగ్ వసూళ్ళని దాటేసి రికార్డులు క్రియేట్ చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2, సలార్ లాంటి పెద్ద పాన్ ఇండియా సినిమాల రికార్డులని కూడా బద్దలు కొట్టింది.ఈ సినిమాకి టోటల్ గా 130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా 131 కోట్లు రాబట్టాలి. ఇంకో 30 కోట్లు షేర్ వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈ వారం చివరి నాటికి ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబడుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: