ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఏకంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక ఈ మూవీ ఏకంగా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండు కూడా సృష్టించింది. ఇక ఆ తర్వాత ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఇక అలరిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా మొన్నటికి మొన్న ఖుషి అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇక ఈ సినిమా అటు ఫైనాన్షియల్  గా మాత్రం సక్సెస్ కాలేదు అని చెప్పాలి.


 ఎందుకంటే ఖుషి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఇక వసూళ్ల పరంగా మాత్రం ఈ మూవీ వెనుకబడిపోయింది. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీ బిజీగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే అటు విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ లిస్టులో గౌతం తిన్ననూరి కూడా ఉన్నాడు. కాగా ఈ డైరెక్టర్ తనదైన టేకింగ్ తో ఇప్పటికే ప్రేక్షకులను ఫిదా చేశాడు. గౌతం తిననూరి సినిమా చేస్తున్నాడంటే మూవీ ఏదో డిఫరెంట్ గా ఉంటుంది అని ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఈ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు ఒక హాట్ బ్యూటీని హీరోయిన్గా ఎంపిక చేశారట.


 ఆమె ఎవరో కాదు ఇటీవల యానిమల్ సినిమాలో ఏకంగా బోల్డ్ పాత్రలో నటించి ఆకట్టుకున్న తృప్తి దిమ్రి. యానిమల్ సినిమాలో కనిపించింది కాసేపే అయినా ఏకంగా రష్మికకు మించిన గుర్తింపును సంపాదించుకుంది తృప్తి. అయితే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఇప్పుడు గౌతం తిన్ననూరి డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాకు ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో శ్రీలీలా నటించిన అనివార్య కారణాలతో ఈ అమ్మడు తప్పుకుందట. దీంతో శ్రీ లీల స్థానంలో త్రిప్తిని చిత్ర బృందం ఇక ఎంపిక చేసింది అనేది తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: