టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. త్రిబుల్ ఆర్ వంటి భారీ విజయం తరువాత జూనియర్ ఎన్టీఆర్ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్

 ఇప్పటికే 80% వరకు పూర్తయింది. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా మేజర్ షెడ్యూల్ జరుగుతోంది. కాగా ఇటీవల సైఫ్ అలీ ఖాన్ కి గాయం అవ్వడం కారణంగా ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ ను ఆపేశారు. సైఫ్ అలీ ఖాన్ మోకాలికి   సర్జరీ చేయించుకుంటున్న కారణంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను తాత్కాలికంగా ఆపారు మూవీ టీం. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన షూటింగ్ ను చాలా వరకు పూర్తి చేశారు. మిగిలిన ప్యాచ్ వర్క్ షూటింగ్ చివరి దశలో చిత్రీకరించబడుతుంది 

అని అంటున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: