సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే వారికి సంబంధించి ఏ విషయం ఇంటర్నెట్ లోకి వచ్చినా కూడా అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. అంతేకాదు ఇక సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్ ఇంట్లో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎంతో మంది హీరో హీరోయిన్స్ తమ అభిమానులతో నేరుగా మాట్లాడటం చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు ఇక తమ కెరియర్ లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా పంచుకోవడం చేస్తున్నారు అని చెప్పాలి.


 ఇలా ఎవరైనా హీరోయిన్ కెరియర్ లో జరిగిన ఏదైనా విషయాలు చెప్పింది అంటే సోషల్ మీడియా జనాలు మొత్తం ఇక ఆ విషయం గురించి చర్చించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే గతంలో హీరోయిన్గా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ఆకట్టుకుంది శ్రద్ధ దాస్. తన అందం అబీనయంతో కుర్ర కారు మతి పోగొట్టింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తెరమీద కనిపించడం లేదు. అయితే ఇటీవల ఈ హీరోయిన్ తన కెరీర్ లో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పింది.


 ఒకానొక సమయంలో బాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా తనను కావాలనే కొట్టింది అంటూ హీరోయిన్ శ్రద్ధదాస్ తెలిపింది. జీత్ అనే మూవీలో మన్నారా నేను కలిసిన నటించాం. అయితే ఒక సన్నివేశంలో నన్ను నెమ్మదిగా కొట్టాలి. కానీ ఆమె గట్టిగా కొట్టింది. దీంతో నా శరీరంపై 30 చోట్ల గాయాలు అయ్యాయి. మరో సీన్లు నా చాతిపై నిజంగానే గుద్దేసింది. ఇంకో సన్నివేశంలో ఏకంగా కర్రతో ముఖంపై కొట్టడంతో నా కంటికి గాయం అయింది. నేను ఆసుపత్రి పాలు అయ్యాను. అయితే ఆమె మనసులో ఏం పెట్టుకుందో తెలియదు కానీ నన్ను నిజంగానే కొట్టేసింది అంటూ శ్రద్ధా దాస్ తెలిపింది. అయితే మన్నారా చోప్రా అటు ప్రియాంక చోప్రా కు కజిన్ సిస్టర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: