సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న ఎంతోమంది తమలో దాగి ఉన్న ప్రతిభను సరికొత్తగా చాటుకునేందుకు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటులుగా కొనసాగుతున్న వారు.. కొన్ని కొన్ని సార్లు దర్శకుడిగా అవతారం ఎత్తి ఇక తమ దర్శకత్వ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరచడం చేస్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఏకంగా దర్శకులే నటులుగా మారిపోయి.. ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా నటుల నుంచి దర్శకులుగా.. దర్శకులు నుంచి నటులుగా మారిన వారు సినిమా ఇండస్ట్రీలో వెతికితే చాలామంది కనిపిస్తూ ఉంటారు. అయితే గతంలో ఇలా కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన వేణు ఏకంగా బలగం అనే సినిమా తీసి సెన్సేషన్ విజయాన్ని సాధించాడు. ఇక జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా మారిపోయాడు. అయితే ఇక ఇప్పుడు వేణు లాగానే మరి కొంతమంది నటులు కూడా దర్శకులుగా మారెందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో రాజమౌళి సినిమా చత్రపతి ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సుప్రీత్ రెడ్డి కూడా ఒకరు అని చెప్పాలి. చత్రపతి మూవీలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించాడు సుప్రీత్ రెడ్డి  ఏకంగా కాట్రాజ్ అనే పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 ఇక చత్రపతి సినిమాలో ప్రభాస్, సుప్రీత్ రెడ్డి మధ్య ఉండే ఫైట్ సీన్ ను  ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఇక తర్వాత కూడా పలు సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు సుప్రీత్ రెడ్డి ఏకంగా దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్నాడట. యువి క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్న ఒక సినిమాతో సుప్రీత్ రెడ్డి దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్  ని ప్రారంభించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. దీంతో నటుడిగా అదరగొట్టిన అతను ఇక దర్శకుడిగా ఎలా మెప్పించమెప్పించ గలుగుతాడో చూసేందుకు  అందరూ ఎదురు చూస్తున్నారు  కాగా ప్రభాస్ నటించిన బిల్లా, చత్రపతి సినిమాలతో పాటు మర్యాదరామన్న సినిమాలలో కూడా విలన్ పాత్రలో నటించాడు సుప్రీత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: