సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇలా సినీ సెలబ్రిటీల అభిమానులు అందరూ కూడా వారి ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవడానికి తెగ ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పర్సనల్ విషయం ఏదైనా తెర మీదకి వచ్చింది అంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను రహస్యంగా ఉంచుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. కేవలం తమ సినిమాల విషయం మాత్రమే కాదు ఏకంగా ఆరోగ్య సమస్యలను కూడా అభిమానులందరితో పంచుకోవడానికి వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఎవరైనా హీరో హీరోయిన్లు ఇక తమ ఆరోగ్య సమస్య గురించి చెప్పారు అంటే చాలు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవల హీరోయిన్ పూనమ్ కౌర్ ఇక తాను గతంలో ఒక వ్యాధితో బాధపడినట్లు చెప్పింది. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. గతంలో టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల సరసన నటించిన పూనమ్.. ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.


 సోషల్ మీడియాలను ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.  ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న ఈమె తాను ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. గత రెండేళ్లుగా ఫైబ్రోమయాల్జీయా ఆ వ్యాధి తనను బాగా ఇబ్బంది పెట్టింది అంటూ చెప్పుకొచ్చింది పూనం కౌర్. ఇక ఈ వ్యాధి కారణంగా కనీసం దుస్తువులు కూడా వేసుకోలేకపోయేదాన్ని.. ఇక దుస్తులు వేసుకుంటే నొప్పులు వచ్చేవి. అందుకే ఎప్పుడూ వదులుగా ఉండే దుస్తులు ధరించే దాన్ని అంటూ పూనం కౌర్ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: