కోలీవుడ్ టాలీవుడ్ లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయింది. రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తెలుగులో మంచి డిమాండ్ సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి సంక్రాంతికి కూడా ఒక సినిమాని విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ లక్కీ యాక్టర్ గా మారిపోయింది.


వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో తరచూ వైరల్ గా మారుతోంది . గతంలో కోలీవుడ్ హీరోలతో లవ్ ఎఫైర్ నడిపినట్టుగా కూడా రూమర్స్ వినిపించాయి.. అయితే వాటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టినప్పటికీ ఇటీవలే హనుమాన్ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలాంటి సమయంలోనే కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన శింబు తో సినిమాలలో నటించి అందరిని మైమరిపించింది.


అయితే వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా మంచి స్నేహబంధం ఉండడంతో శింబు వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పైన తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ.. శింబుతో తన పెళ్లి జరగడం లేదని అతను మంచి మిత్రుడు అంటూ కితాబ్ ఇచ్చింది.. మా గురించి వచ్చే వార్తలలో అసలు నిజం లేదంటూ కూడా తెలిపింది.. అసలు ఇలాంటి విషయాలను ఎవరు నమ్మకండి అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ విషయాలను కొట్టిపారేసింది. గత ఏడాది బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ. వరలక్ష్మి అభిమానులు మాత్రం ఏమి పెళ్లి గురించి ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: