పైగా స్క్రీన్ మీద కూడా వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అప్పట్లో చట్టపట్టలేసుకొని తిరుగుతూ కూడా బయట కనిపించడంతో వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారని అభిమానుల సైతం అనుకున్నారు. కానీ వాటన్నిటిని ఒక్కసారిగా పుల్ స్టాప్ పెట్టింది ఈ హట్ బ్యూటీ.. ఒక సినిమా ప్రమోషన్స్ లో హెబ్బా పటేల్ మాట్లాడుతూ నేను కూడా రాజ్ తరుణ్ తో వస్తున్న రూమర్ల గురించి విన్నాను.. తనకు అవి తెలియదు అనుకోకండి.. కాకపోతే మేము అలాంటి విషయాలను సీరియస్ గా తీసుకోలేదని తెలిపింది.
మరి కొంతమంది మీడియా వారు తమ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని రాస్తున్నారు.. అది తనకి చాలా ఫన్నీగా అనిపించిందని కావాలంటే మీరు ఏమైనా రాసుకోండి మేము అసలు పట్టించుకోను.. ఎలా రాసుకున్నా నాకు నో ప్రాబ్లం అంటూ ఒక్కసారిగా చెప్పేసింది.. దీంతో రాజ్ తరుణ్ తన మధ్య ఏమీ లేదని చెప్పకనే చెప్పేసింది. ఈ ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ కు ఈ మధ్య పలు సినిమాలలో అవకాశాలు రావట్లేదు.. కేవలం చిన్న సినిమాలతోనే సరిపెట్టుకుంటోంది.. ప్రస్తుతం రాజ్ తరుణ్ పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి