నాగార్జున ఎందుకు ఆ సీన్లను మారుస్తున్నారని దర్శకుడుని అడిగినప్పుడు దిల్ రాజు సినిమాలో కనెక్టివిటీ మిస్ అవుతుంది అందుకే మారుస్తున్నామని చెప్పారట.అయితే అప్పుడు నాగార్జున ఏదైనా చేస్తే నాకు చెప్పి చేయాలి కానీ మీ అంతట మీరు మార్చుకుంటే ఎలా ఉంటుందో అని నాగార్జున కొంచెం ఫైర్ అవడంతో దిల్ రాజు నాగార్జున ని కూల్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ నాగార్జున మాత్రం ఆ విషయంలో చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఫైనల్ గా వీళ్లు మార్చిన కొన్ని సీన్ల వల్లనే సినిమా అనేది పెద్దగా ఆడలేదనే విషయాన్ని తెలుసుకున్న నాగార్జున రిలీజ్ తర్వాత కూడా దిల్ రాజు మీద కొంతవరకు సీరియస్ అయినట్టు గా అప్పట్లో వార్తలు అయితే పుష్కలంగా వచ్చాయి. ఇక మొత్తానికైతే దిల్ రాజు నాగార్జునకు మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి.
ఆ తర్వాత మళ్లీ వీళ్ల కాంబినేషన్ లో సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు అయితే సినిమా అయితే రాలేదు. కానీ వీళ్ళ మధ్య ఇప్పుడు మంచి మాటలే ఉన్నాయనే వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి త్వరలో వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటూ పలువురు సినిమా ప్రముఖులు ఈ సినిమా గురించి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి