టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కమీడియన్ లలో ఒకరు అయినటువంటి వైవా హర్ష తాజాగా సుందరం మాస్టర్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వహించగా ... ఆర్టీ టీమ్ వర్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజమూవీ ని నిర్మించాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ ను ఈ మూవీ మేకర్స్ విడుద‌ల చేయ‌గా వాటికి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. 

సినిమా ఫిబ్ర‌వ‌రి 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఒక మారుమూల గ్రామంలో అనుమానాస్పదంగా ఏవో సంఘటనలు జరుగుతుంటాయి. అయితే అవి క‌నిపెట్టడానికి సుందరం మాస్టర్ గా ఆ గ్రామంలో అడుగుపెడ‌తాడు వైవా హర్ష.  అయితే గ్రామానికి టీచర్‌ గా వెళ్లిన సుందరం మాస్టర్‌ కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఈ సినిమా క‌థ. ఇక ఈ ట్రైల‌ర్ మొత్తం ఫుల్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన్‌గా సాగింది.

ఇక ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లో దివ్య శ్రీపాద ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోండ‌గా.. రవితేజ టీమ్‌ వర్క్స్‌ , గోల్డెన్‌ మీడియా బ్యానర్లపై రవితేజ , సుధీర్‌కుమార్‌ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు కమీడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వైవా హర్ష హీరో గా ఈ సినిమాతో ఏ స్థాయి గుర్తింపును సంపాదించుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: