చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ లో 1234 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ అనే పాట లో ప్రియమణి.. షారుక్ ఖాన్ తో చిందులేసింది. “షారుక్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని ద్వేషించే వాళ్లు ఉండొచ్చు. కానీ అతన్ని ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువగా ఉన్నారు. నేను కలిసిన మంచి మనసున్న వాళ్లలో షారుక్ ఖాన్ ఒకరు. ఆయన మహిళలతోనే కాదు అందరి తోనూ ఎంతో మర్యాదగా నడుచుకుంటారు.. ప్రతి ఒక్కరితో ఎలా ఉండా లో నేను ఆయన నుంచే నేర్చుకున్నాను” అని ప్రియమణి చెప్పింది.”షారుక్ తో చెన్నై ఎక్స్‌ప్రెస్ రోజుల నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. నా డ్యాన్స్ ఎక్క డో చూసి రోహిత్ శెట్టి, షారుక్ ఖాన్ తమను కలవడానికి రమ్మని పిలవడం నాకు ఇప్పటి కీ గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు” అని ప్రియ మణి తెలిపింది. ఆ తర్వాత కూడా గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీలో ప్రియమణి కీలక పాత్ర లో నటించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి