తెలుగు బుల్లితెరపై చాలా కాలం నుంచి ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా చేస్తున్నారు. కానీ, ఇప్పుడు వారిలో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తున్నారు.అలాంటి వారిలో బోల్డు బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. మామూలుగానే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. అందంతో పాటు టాలెంట్‌తో ఆకట్టుకుంది. ఫలితంగా వరుసగా టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన 'గుంటూరు కారం' మూవీ ఆఫర్‌ను రష్మీ రిజెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. దీనిపై తాజాగా ఆమె ఏం చెప్పిందో చూడండి.
యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి ఎంటరైంది. అలా చాలా చిత్రాల్లో అదిరిపోయే పాత్రల్లో నటించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి అడుగు పెట్టి జబర్ధస్త్ షోతో యాంకర్‌గా ఎంటరైంది. ఇది మాత్రం ఆమె కెరీర్‌ను మార్చేసింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోన్న రష్మీ.. తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది.బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా హవాను చూపిస్తోన్న రష్మీ గౌతమ్.. ఆఫర్లు వచ్చినప్పుడల్లా హీరోయిన్‌గానూ నటించింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో ఈ అమ్మడు ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది. కానీ, వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే రష్మీకి హిట్‌ను అందించింది. ఆ తర్వాత ఆమె చాలా మూవీల్లో నటించినా.. విజయం మాత్రం పెద్దగా దక్కలేదనే చెప్పాలి.చాలా కాలంగా సినిమాలు, షోలు చేసిన రష్మీ గౌతమ్.. కొంత కాలంగా వేగం తగ్గించేసింది. అయితే, ఇప్పుడు బుల్లితెరపై 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోలను కూడా హోస్ట్ చేసింది. వీటిలో తనదైన రీతిలో సందడి చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా హడావిడి చేస్తోంది. ఇలా 'భోళా శంకర్', 'బాయ్స్ హాస్టల్' వంటి చిత్రాల్లోనూ రష్మీ నటించింది.వరుసగా షోలు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మీ గౌతమ్‌కు మరిన్ని అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమెకు సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీలోనూ ఆఫర్ వచ్చినట్లు టాక్ వచ్చింది. అయితే, దీన్ని రష్మీ రిజెక్ట్ చేసిందని ప్రచారం జరిగింది.రష్మీ గౌతమ్‌కు 'గుంటూరు కారం' మూవీలో ఏ ఆఫర్ వచ్చిందని చాలా మంది చర్చించుకున్నారు. అదే సమయంలో ఆమె ఈ చిత్రంలోనే సూపర్ హిట్ అయిన 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌నే రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇందులో పూర్ణ చేసిన రోల్‌లోనే రష్మీ నటించాల్సి ఉన్నా.. ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించిందని ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపించింది.గుంటూరు కారం' మూవీ ఆఫర్‌ను రష్మీ రిజెక్ట్ చేసిందన్న వార్తలపై తాజాగా రష్మీ గౌతమ్ స్పందించింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. 'అసలు ఆ సినిమా యూనిట్ నుంచి నాకు కాల్ రాలేదు. ఈ వార్తలు అన్నీ ఫేక్. ఈ మధ్యనే దీనిపై క్లారిటీ ఇచ్చాను. అయినా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది' అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: