టాలీవుడ్ లో అతిలోకసుందరిగా పేరు సంపాదించిన శ్రీదేవి.. ఆమె సినీ వారసురాలుగా జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులో దేవర సినిమాతో దక్షిణాది సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు. అంతేకాకుండా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న RC -16 చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే తాజాగా ఈ కొత్త ప్రాజెక్టు కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమాకి రూ .5నుంచి 8కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రం కోసం అంటే రామ్ చరణ్ సినిమా కోసం రూ .14 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం. దాదాపుగా ఒకేసారి కొన్ని కోట్ల రూపాయలు పెంచేసినట్టు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో ఈమె కథ రెమ్యూనరేషన్ విషయం పోస్తే చాలా ఎక్కువ అని కూడా చెప్పవచ్చు.


అయితే ఈ విషయం పైన ఇంకా జాన్వీ కపూర్ టీమ్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. దేవర సినిమా తర్వాత టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న రెండవ సినిమా అన్నట్టుగా ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. RC -16 చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్ లో కూడా జాన్వీ కి బాగానే సినిమాలు వస్తున్నాయి ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడుతూ ఉండడంతో స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేక పోతోంది. తన మొదటి సినిమాతోనే తెలుగులోకి స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన తల్లి మాదిరిగానే రాణించాలని పక్కా ప్లాన్ తోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: