ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో గత ఏడాది డిసెంబర్ 22 న సలార్ మూవీ విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపుగా ప్రభాస్ నటించిన ఐదారు సినిమాల తర్వాత మళ్లీ అంతటి సక్సెస్ ని అందుకున్నారు. చివరిగా బాహుబలి-2 సినిమా సక్సెస్ తర్వాత సలార్ సినిమాకి అంతటి సక్సెస్ అందుకున్నారు. చివరిలో ఈ సినిమా సీక్వెల్న సైతం చిత్ర బృందం శౌర్యంగా పర్వం అనే విధంగా తెలియజేశారు. అయితే అభిమానులు కూడా సలార్-2 సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


 ఈ సినిమాకు ఉన్న హైపుని చూసి చిత్ర బృందం త్వరలోనే ఈ సినిమాని కూడా షూటింగ్ మొదలు పెడతారని అభిమానులు సైతం అనుకోగా ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చే విధంగా సలార్ -2 సినిమా ప్రశాంత్ నీల్ వెంటనే తెరకెక్కించే ఆలోచనలో లేనట్లుగా తెలుస్తోంది. కేవలం ఎన్టీఆర్ తో ఒక చిత్రాన్ని మరియు kgf -3 సినిమాల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోందట. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఉండడం చేత ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతే సలార్-2 సినిమా ఉంటుందని సమాచారం.


అయితే ఈ విషయం మాత్రం ప్రభాస్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రెండు సినిమాలు అయిపోవాలి అంటే కచ్చితంగా నాలుగేళ్ల వరకు ఆగాల్సిందే.. దాదాపుగా 2028 పై మాటే సలార్-2 సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా మే 9వ తేదీన  విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ లెవెల్ లో ఎన్నో భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ క్యాస్టింగ్ కూడా ఇందులో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: