సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో తెరమీద కనిపించే నటీనటులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు దేవుడు వీరిని ఇంత అందంగా ఎలా పుట్టించాడు అని ఇక సినిమా లేదంటే సీరియల్స్ లో ఆయా నటీనటులను తెరమీద చూస్తున్న ప్రేక్షకులకు అనిపిస్తూ ఉంటుంది. ఇక తెర మీద కనిపించే నటీనటులను చూసి జీవితం అంటే వీరిదే.. ఇలా ఎప్పుడు సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కానీ ఇక తెరమీద నవ్వుతూ కనిపించే సిని సెలెబ్రిటీల జీవితాలలో కన్నీళ్లు పెట్టించే ఎన్నో కష్టాలు ఉంటాయి అన్నది అప్పుడప్పుడు తెర మీదకి వస్తూ ఉంటుంది.


 అయితే ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగి ఇక అగ్రతారక హవా నడిపించిన వారు ఆ తర్వాత కాలంలో మాత్రం తప్పుడు నిర్ణయాల కారణంగా చివరికి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవడం లాంటివి ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది విషయంలో జరిగాయ్. మరీ ముఖ్యంగా ఎంతో మంది హీరోయిన్లు ఇలా తప్పుడు నిర్ణయాల కారణంగా కెరియర్ను నాశనం చేసుకొని.. జీవితం చివరి రోజులో దుర్భర స్థితిలో గడిపిన వారు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో ట్రాజడీ క్వీన్ గా పేరు సంపాదించుకున్న మీనా కుమారి కూడా ఒకరు అని చెప్పాలి.


అప్పట్లో ఈమె హీరోలకు మించిన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు హీరోలకు మించి రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది. కానీ ఇక చివరి రోజుల్లో మాత్రం దుర్భర స్థితిని ఎదుర్కొంది. 1933లో మహారాష్ట్రలో జన్మించిన ఈమె.. నాలుగేళ్లకే నటన ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. ఇక కెరియర్ లో 90 కి పైగా సినిమాల్లో నటించింది మీనా కుమారి. ఇక మన దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొని రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపును సంపాదించుకుంది ఈమె. కానీ డైరెక్టర్ కమల్ లో పెళ్లాడాలి అని ఆమె తీసుకుని నిర్ణయం చివరికి ఆమె జీవితాన్ని నాశనం చేసింది. పెళ్లి తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. భర్త వేధింపులతో ఆమె తాగుడుకు బానిసగా మారిపోయింది. దీంతో 39 ఏళ్ల వయసులోనే దుర్భర స్థితిలో చివరికి ప్రాణాలను కోల్పోయింది మీనా కుమారి.

మరింత సమాచారం తెలుసుకోండి: