ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల నుంచి స్టార్ హీరోలు కొనసాగుతున్న స్టార్స్ వారసులు చిత్ర పరిశ్రమకు హీరోలుగా పరిచయం అవడం చూస్తూనే ఉన్నామ్. అయితే ఇలా ఎంతోమంది ఇక హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ ఇక స్టార్స్ వారసులుగా ఇండస్ట్రీకి హీరోయిన్స్ గా పరిచయమైన వారు మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. అలాంటి వారిలో శృతిహాసన్ కూడా ఒకరు. లోకనాయకుడిగా తన నటనతో సినీ ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధులను  చేసి ఇప్పటికి స్టార్ హీరోగా హవా నడిపిస్తున్న కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతిహాసన్.


 ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్బస్టర్లను ఖాతాలో వేసుకుంది. అయితే కెరీర్ సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్నా సమయంలోనే ఏకంగా లైవ్ మ్యూజిక్ అంటూ కొన్నాళ్లపాటు చిత్ర పరిశ్రమకు దూరమైంది  కానీ మళ్ళీ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత ప్రభాస్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది శృతిహాసన్. కెరియర్ లో ఎంతో బిజీ బిజీగా గడుపుతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లీడ్ రోల్ లో చేసిన లేదంటే వేరే వాళ్ళ చిత్రాల్లో నటించిన పాత్రకు న్యాయం చేసేందుకు 100% కష్టపడతాను అంటూ శృతిహాసన్ తెలిపింది. అలా కష్టపడి పనిచేయడమే నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది . ఇక రోజు చివరిలో నాకు అలసిపోలేదు అనిపించింది అంటే ఆ అనుభవం ఎంతో చెత్తగా అనిపిస్తూ ఉంటుంది అంటూ శృతిహాసన్ తెలిపింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ మూవీలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: