సిని సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సెలబ్రిటీలు ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కూడా కెమెరాలు ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. ముఖ్యంగా జిమ్స్, ఎయిర్పోర్టుల్లో నుంచి లేడీ సెలబ్రిటీలు వస్తున్నప్పుడు మేడం ఒక్క ఫోటో అంటూ ఫోటోగ్రాఫర్లు తెగ ఫోటోలు తీసేస్తూ కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టడం కూడా చేస్తూ ఉంటారు. దీంతో ఇది చూసి వామ్మో సెలబ్రిటీల లైపే బాగుంది. ఎప్పుడు ఫోటోగ్రాఫర్లు వారికోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు.


 ఇక్కడ ఇలా సినీ సెలబ్రిటీలు బయట కనిపించారు అంటే చాలు వారిని ఫోటోలు తీయడం చేస్తూ ఉంటారు అంటూ ఇక ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటూ సీనియర్ హీరోయిన్ ప్రియమణి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఏకంగా ఆయా ఫోటోగ్రాఫర్లకు డబ్బులు ఇచ్చి మరి ఇలా ఫోటోలు తీయించుకుంటారు అంటూ సంచలన విషయాలను బయటపెట్టింది  ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచమంతా పాకిపోవడంతో పబ్లిసిటీని సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.


 ఇక ఈ మధ్యకాలంలో అయితే ఎంతో మంది హీరోయిన్స్ జిమ్ లో కసరత్తులు చేసి బయటకు వస్తుండగా.. ఎంతో మంది ఫోటోగ్రాఫర్లు ఆమె కోసం వెయిట్ చేసి మరి ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వీడియోలు చూసినప్పుడు వామ్మో ఈ బ్యూటీ కి మామూలు ఫాలోయింగ్ లేదు అని అనుకుంటూ ఉంటారు నేటిజన్స్. అయితే ఎయిర్పోర్టులో కూడా ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్ ఫోటోలు తీయడం చూస్తూ ఉంటాం. అదే టైం కి ఆ హీరో హీరోయిన్లు అక్కడికి వస్తారని వాళ్ళకి ఎలా తెలుసబ్బా అని అనుమానం కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అయితే ఇదే విషయంపై ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం ఇప్పుడు వరకు ఎవరికీ తెలియకపోవచ్చు. ఇది ముంబైలో జరుగుతుంది. సెలెబ్రెటీలు ఎయిర్పోర్టులో కనిపించగానే ఫోటోగ్రాఫర్లు ఎలా వస్తారు అని మీరు అనుకుంటారు. ఓపెన్ గా చెబుతున్న వారికి ముందుగానే అరేంజ్  చేస్తారు. ఎంతమంది కావాలి ఏ టైం కి కావాలి అంటే ఆ టైం కి అక్కడికి వస్తారు. ఇలా డబ్బులు పెట్టుకుని ఫోటోగ్రాఫర్లు అరెంజ్ చేసుకుంటారు అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: