మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఈ సినిమాలో కియార అద్వానీ , చరణ్ కి జోడి గా నటిస్తోంది. ఇక అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సాంగ్ విడుదలను కూడా ఈ మూవీ బృందం వాయిదా వేసింది. ఇక అప్పటి నుండి ఆ సాంగ్ కి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే ఈ మూవీ విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఇక ఈ సంవత్సరంలో కూడా గేమ్ చెంజర్ విడుదలకు పెద్దగా ఆప్షన్లు లేవు అని చెప్పవచ్చు.

ఎందుకు అంటే ఈ సంవత్సరం ఇప్పటికే సమ్మర్ లో పెద్ద సినిమా లకు సంబంధించిన విడుదల తేదీలు లాక్ అయ్యాయి. అలాగే దసరా కు కూడా విడుదల తేదీలు లాక్ అయి ఉన్నాయి. ఇక కేవలం పెద్ద సినిమాకు మిగిలి ఉన్నది డిసెంబర్ నెల మాత్రమే ... మరి అప్పుడైనా గేమ్ చెంజర్ మూవీ ని విడుదల చేస్తారా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: