తెలుగు సినీ పరిశ్రమలో నటిగా , నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నిహారిక గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన కెరియర్ లో చాలా సినిమా లలో నిహారిక హీరోయిన్ పాత్రల్లో నటించింది. కాకపోతే ఈ ముద్దు గుమ్మ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాలను అందుకోలేదు. ఇకపోతే అలాంటి సమయం లోనే ఈ నటి సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించింది. వాటి ద్వారా మాత్రం ఈమెకు మంచి స్థాయి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితమే చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. 

ఆ తర్వాత కొంత కాలం పాటు విరి సంసార జీవితం చాలా సాఫీగా ముందుకు సాగింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం విరు ఎవరికి వారే ఉంటూ తమ జీవితాలను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మళ్లీ సినిమాల్లో నటించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో నిహారిక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని సైడ్ వ్యూ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక కు సంబంధించిన ఈ రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: