సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడి గా నటించారు. ఇకపోతే ఈ మూవీ ఫిబ్రవరి 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 2 రోజుల్లో నైజాం ఏరియాలో 1.70 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 40 లక్షల కలెక్షన్ లు , ఆంధ్ర ప్రదేశ్ లో 1.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమాకు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి 3.75 కోట్ల షేర్ ... 7.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే రెండు రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 1.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 4.85 కోట్ల షేర్ ... 9.45 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి 11 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా మరో 6.15 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: