టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కావ్య ధాపర్ , వర్ష బొల్లమ్మ హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే ఫిబ్రవరి 16 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇక ఊరు పేరు భైరవకోన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సందీప్ ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి త్రినాధ్ రావు నక్కిన తో సంప్రదింపులను జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు ఆఖరుగా రవితేజ హీరో గా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన ధమాకా అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అందుకున్నాడు. ఇకపోతే త్రినాథ్ రావు నక్కిన తాజాగా సందీప్ కిషన్ కి ఓ అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్ కథను చెప్పినట్లు ఆ కథ సందీప్ కి సూపర్ గా నచ్చడంతో వెంటనే ఈయన దర్శకత్వంలో నటించడానికి ఈ యువ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ ని హాస్య మూవీస్ మరియు ఏ కే బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ సందీప్ కిషన్ , త్రినాధ్ రావు నక్కిన కాంబో లో కనుక సినిమా ఓకే అయినట్లు అయితే ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: