మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ నటుడు ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయినప్పటికీ శంకర్ కొంత కాలం క్రితం షూటింగ్ ను ప్రారంభించే ఆపివేసిన భారతీయుడు 2 సినిమాల కూడా తిరిగి ప్రారంభించడంతో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కాస్త డిలే అవుతూ వస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు "కే జి ఎఫ్" సినిమాకు యాక్షన్ ఎపిసోడ్ లను తెరకెక్కించినటువంటి అంబరీవ్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను కూడా ఈ మూవీ బృందం చాలా రోజుల పాటు ప్లాన్ చేసినట్లు ... ఈ ఎపిసోడ్ పూర్తి అయినట్లు అయితే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లే అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: