తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిని తిరుగులేని ఒక శక్తిగా చెప్పవచ్చు. ఎవరి అండ దండ లేకుండా ఎదిగిన వ్యక్తి. ఆయనని ఢీకొట్టే హీరో ఇప్పటివరకు ఇండస్ట్రీలో లేడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఆయన చేయని సినిమా లేదు, ఆయన పోషించని పాత్ర లేదు. ఆయన నటనకి నిదర్శనంగా ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి.
అలాంటి మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికీ కూడా ఆయన పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ స్టార్ హీరో గా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన ఇప్పుడు శంకర్ తో ‘గేమ్ చెంజర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇక మీదట రామ్ చరణ్ కి తిరుగు లేదనే చెప్పాలి.
దీంతో పాటుగా బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక డిఫరెంట్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో తన సత్తా చాటితే రామ్ చరణ్ మరొక సారి పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల వారసునిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ప్రస్తుతం రామ్ చరణ్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ఇంకా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. అలాగే వెంకటేష్ కొడుకు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. నాగార్జున కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాళ్లు భారీ రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోతున్నారు. కాబట్టి ముందు జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోల కొడుకులలో రామ్ చరణ్ ఒక్కడే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక ఈయనను బీట్ చేసే కెపాసిటీ మిగతా స్టార్ హీరోల కొడుకులకు లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే ఆయన రామ్ చరణ్ ను బీట్ చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: