ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు టాలీవుడ్లో కాస్త తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో విశ్వక్సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఎవరో అవకాశం ఇస్తారు ఇంకెవరో తన కెరియర్ను నిలబెడతారు అని ఈ హీరో వేచి చూడలేదు. ఏకంగా తానే డైరెక్టర్గా తానే నిర్మాతగా తానే హీరోగా చేసి తన కెరియర్ను తానే నిలబెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇక తన సినిమాలతో యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 అంతేకాదు మాస్ కా దాస్ అనే గుర్తింపును కూడా అందుకున్నాడు విశ్వక్సేన్. విశ్వక్సేన్ ఏది ఉన్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు విశ్వక్సేన్ మాట్లాడే మాటలు వివాదాలకు  కూడా దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే గతంలో ఏకంగా సీనియర్ హీరో అర్జున్ యంగ్ హీరో విశ్వక్సేన్ మధ్య ఒక వివాదం నెలకొంది. ఏకంగా అర్జున్ తో విశ్వక్సేన్ తీయాల్సిన సినిమా ఆగిపోయింది. దీంతో విశ్వక్సేన్ కి కనీసం క్రమశిక్షణ లేదు అంటూ అర్జున్ విమర్శలు కూడా చేశాడు. ఇక తర్వాత ఈ విషయంపై స్పందించిన యంగ్ హీరో అర్జున్ కి కౌంటర్ కూడా ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ వివాదం పై ఎన్నో సార్లు స్పందించిన యంగ్ హీరో విశ్వక్సేన్ మరోసారి ఈ వివాదం గురించి మాట్లాడాడు. హీరో అర్జున్ విషయంలో నాకు జరిగింది వేరే బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోతో జరిగి ఉంటే ఎలా ఉండేది. అర్జున్ చేసిన కామెంట్స్ కారణంగా నేనే ఎక్కువగా నష్టపోయాను. నేనేం చేయలేదు. కేవలం ఒకే ఒక రోజు షూటింగ్ ఆపమని అడిగాను అంతే. దానికి ఆయన మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ ని ప్రాధేయపడ్డారు. అర్జున్ కి తీసుకున్న దాని కంటే ఎక్కువే తిరిగి ఇచ్చాను అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: