మెగా పవర్ స్టార్ రామ్ చరణ్హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కారణం ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం అందులోనూ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం. దీంతో ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 'అంతేకాదు.. ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ప్రెజెంట్ జనరేషన్ కు సంబందించిన ఐఏఎసీ అధికారి పాత్ర కాగా.. మరొకటి 80 దశకానికి సంబందించిన పాత్ర. ఈ పాత్రకు లుక్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అప్పటి నుండి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, ప్రతీకారం, నమ్మకద్రోహం వంటి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయట. క్లైమాక్స్ ఆడియన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందని, శంకర్ గత చిత్రాలు ఒకే ఒక్కడు,భారతీయుడు, అపరిచితుడు వంటి సినిమాల రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందని టాక్. మరి రిలీజ్ తరువాత గేమ్ ఛేంజర్ సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుంటుందో చూడాలి. ఇక సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: