ఆర్ ఆర్ ఆర్ లాంటి గ్లోబల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి అయిన వెంటనే స్టార్ట్ అయ్యింది. సరిగ్గా షూటింగ్ జరిగి ఉంటే ఈ సినిమా ఈ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ శంకర్ కి మధ్యలో కమల్ హాసన్ తో అప్పట్లో మొదలు పెట్టిన 'ఇండియన్ 2 ' సినిమా ఉంది. ఆ సినిమాని తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో  'గేమ్ చేంజర్' సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అలా ఎన్నో ఒడిదుడుగుల మధ్య షూటింగ్ ని జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ నెలతో ముగుస్తుందని సమాచారం తెలుస్తుంది. కానీ ఈ మూవీ విడుదల తేది ఎప్పుడు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ అనేది రాలేదు. మరోపక్క స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలన్నిటికీ డేట్స్ కన్ఫర్మ్ అయిపోతున్నాయి.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా మే 9వ తారీఖున విడుదల కాబోతుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' సినిమా ఆగస్టు 15 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇంకా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రం సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల కాబోతుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' చిత్రం అక్టోబర్ 10 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇలా మంచి విడుదల తేదీల మొత్తాన్ని స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే లాక్ చేసుకున్నాయి. ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా పరిస్థితి ఏమిటనేదే పెద్ద ప్రశ్న. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చెయ్యడానికి సిద్ధం గా ఉన్నాడట నిర్మాత దిల్ రాజు. కానీ శంకర్ పెద్ద కూతురు రెండో పెళ్లి పనుల్లో ఆయన బిజీ కానున్నాడు. అందువల్ల ఈరోజు కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి ఆ షెడ్యూల్ అవ్వగానే తన కూతురి పెళ్లి కోసం బ్రేక్ తీసుకొనున్నాడు శంకర్. సో అందువల్ల ఈ సినిమా డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట.ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ శంకర్ పై చాలా కోపంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: