రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న కల్కి సినిమా ప్రచార చిత్రాలతో భారీ హైప్ తెచ్చుకుంది. సినిమా మొదలైన కొన్నాళ్లకు వదిలిన ఫస్ట్ లుక్ టీజర్ అయితే హాలీవుడ్ సినిమాను తలపించేలా చేశాడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుండగా కమల్ హాసన్ కి కూడా ఈ సినిమా కోసం భారీ పారితోషికం అందిస్తుందని తెలుస్తుంది.

అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా కోసం కమల్ హాసన్ కి కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. కల్కి సినిమాలో కమల్ హాసన్ ప్రతి నాయకుడి పాత్ర చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ పాత్రలో ఆయన నటించేందుకు గాను దాదాపు 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది. కమల్ హాసన్ కెరీర్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ గా ఈ సినిమా వస్తుంది.

కల్కి సినిమా రెమ్యునరేషన్ ల కోసమే దాదాపు సగం బడ్జెట్ పెట్టేస్తున్నారు. ప్రభాస్, కల్కితో పాటుగా దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ఇలా అందరు కాస్టింగ్ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉండనుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా వారి వారి పాత్రలు భారీ తనంతో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ కల్కి కూడా రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుంది. సినిమాను హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చేస్తున్నాడట నాగ్ అశ్విన్. ఈ సినిమాను మే 9న రిలీజ్ లాక్ చేయగా సినిమా అనుకున్న డేట్ కి వస్తుందా లేదా అన్న డౌట్ అయితే ఉంది. మరి సినిమాను చిత్ర యూనిట్ ఆ డేట్ కి రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: