మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజైంది. సినిమా ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. సినిమా రిలీజై మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా రీసెంట్ గా 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది.

ఈగల్ సినిమా చివర్లో ఈగల్ 2 యుద్ధ కాండ కూడా అనౌన్స్ చేశారు. ఈగల్ 2 పై ఈగల్ మొదటి పార్ట్ ఇంపాక్ట్ ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈగల్ 1 సినిమాలో అసలు కథ మొత్తం రెండో భాగంలో ఉందని చెప్పాడు. అయితే ఈగల్ 1 సినిమా ఫలితం చూశాక మేకర్స్ ఈగల్ 2 పై ప్లాన్ ఏదైనా మార్చుకుంటారా లేదా అదే రేంజ్ కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఈగల్ 1 సినిమా రిజల్ట్ చూశాక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈగల్ పార్ట్ 2 ని మరింత గ్రిప్పింగ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈగల్ 2 కచ్చితంగా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈగల్ 2 లో యాక్షన్ ఘట్టాలు కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈగల్ సినిమా సెకండ్ పార్ట్ మాస్ రాజా తప్పకుండా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఈగల్ 2 లో అనుపమ పరమేశ్వరన్ కావ్య థాపర్ ఈ ఇద్దరిలో ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో రవితేజ సూపర్ ఎనర్జిటిక్ గా కనిపించనున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: