అల్లు అర్జున్ సుకుమార్ ఈ కాంబోలో సినిమా అంటే అది బ్లాక్ బస్టర్ అందుకున్నట్టే లెక్క. పుష్ప 1 తో ఈ కాంబో మీద అంచనాలు మరింత పెరిగాయి. పుష్ప 1 పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టించగా ఆ హంగామాని కొనసాగించేందుకు పుష్ప 2 తో రాబోతున్నారు. పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ ప్లాజ్ చేయగా అనుకున్న టైం కి సినిమాను వదలాలని మేకర్స్ కష్టపడుతున్నారు. ఇక ఇదిలాఉంటే పుష్ప 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ చేస్తారని లేటెస్ట్ టాక్.

పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉంటుందని అల్లు అర్జున్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో చెప్పాడు. అల్లు అర్జున్ చెప్పినట్టుగానే పుష్ప 3 ఉంటుంది కానీ దానికి చాలా టైం ఉంటుందని తెలుస్తుంది. అయితే పుష్ప 2 లుక్ లోనే పుష్ప 3 ఉంటుంది కాబట్టి పుష్ప 3 లో కొన్ని సీన్స్ ని పుష్ప 2 రిలీజ్ తర్వాత షూట్ చేస్తారట సుకుమార్.

అలా షూట్ చేసిన సీన్స్ ని తర్వాత చేయబోయే పుష్ప 3 సినిమా కోసం వాడుకుంటాడని తెలుస్తుంది. పుష్ప 1 బాటలోనే పుష్ప 2 రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా మారేందుకు వీలుగా సినిమా ను తెరకెక్కిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. పుష్ప 3 సినిమా ను కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుండ గా ఈ సినిమా మాత్రం రెండేళ్ల తర్వాత ఉంటుందని చెప్పుకుంటున్నారు. పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం పుష్ప 3 ని మరీ లేట్ చేయకుండా వెంటనే మొదలు పెట్టే ఆలోచన లో ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: