సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ప్రియమణి కూడా ఒకరు. ప్రియమణి రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ చాలా మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. ఈమధ్యనే భామకలాపం 2 సినిమా  ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ప్రియమణి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో బాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ బాగోతం మొత్తం బయటపెట్టారు. సాధారణంగా బాలీవుడ్ సినిమా సెలబ్రిటీలో ఎయిర్ పోర్ట్, జిమ్ వంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే వారిని ఫోటోలు తీయడం కోసం ఫోటోగ్రాఫర్లు కుక్కల్లా ఎగబడుతూ ఉంటారు.


అయితే చాలామందికి వీళ్ళు అక్కడ ఉండటం ఫోటోగ్రాఫర్స్ కి ఎలా తెలుస్తుందన్న సందేహం వస్తుంది.అయితే తాజాగా ఈ సంగతి గురించి ప్రియమణి అసలు విషయం బయట పెట్టారు. సినీ సెలబ్రిటీలు జిమ్ వద్ద ఉన్నారని, ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నారనే విషయాన్ని స్వయంగా వారి పి ఆర్ టీం ద్వారా ఫోటోగ్రాఫర్లకు తెలియజేస్తారని ప్రియమణి అసలు బాగోతం బయట పెట్టారు. పనైపోయిన వెంటనే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారని, అంతేకాకుండా పీఆర్ లు కూడా చాలా వరకు డబ్బులు నొక్కేస్తారని తెలిపారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ ఆనవాయితీ ఎక్కువగా ఉంది అంటూ తాజాగా ప్రియమణి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఫోటోగ్రాఫర్లు వారిపై దృష్టి పెట్టడం వల్ల వారికి మరింత పాపులారిటీ వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తుంటారని ప్రియమణి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: