నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వనిత విజయ్ కుమార్ ఎవరో కాదు నటుడు విజయ్ కుమార్, మంజుల కుమార్తె.. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి భారీగానే సంపాదించుకుంది.. అయితే ఇమే తన వ్యక్తిగత విషయాల ద్వారా నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం పైన కూడా గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి. అయితే ఏ పెళ్లి కూడా తనకు కలిసి రాకపోవడంతో.. ప్రస్తుతం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఒంటరిగా జీవనాన్ని సాగిస్తోంది.


ఎప్పుడు వివాదాలలో ఉండేటువంటి వనిత విజయ్ కుమార్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేసింది. తన ఇంట్లో జరుగుతున్నటువంటి పెళ్లి వేడుకకు తనకు ఆహ్వానం లేదంటూ కూడా సోషల్ మీడియాలో ఈమె ఒక పోస్ట్ ని షేర్ చేసింది.. నటుడు విజయ్ కుమార్ కు ఇద్దరు భార్యలు అందులో పెద్ద భార్య కుమార్తె అనిత కూతురు దియా వివాహ వేడుకలు ఇటీవల చాలా గ్రాండ్గా జరిగాయి.. దీంతో వరుసకు వనిత విజయ్ కుమార్ కి కూడా ఈమె కూతురు వరుస అవుతుంది.


ఈ క్రమంలోని ఈ పెళ్లి వేడుకలలో మొదటి భార్య ముగ్గురు పిల్లలు రెండవ భార్య మంజుల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలా ఐదుగురు దియా పెళ్లి వేడుకను చాలా గ్రాండ్గా చేశారు. హల్దీ సంగీతం మెహందీ ఇలా అన్ని వేడుకలలో కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు ఈ పెళ్లి వేడుకలకు మాత్రం వనిత విజయ్ కుమార్ కు ఆహ్వానం లేకపోవడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తనను తాను సింహంతో పోల్చుకున్న.. ఒక వీడియోని షేర్ చేస్తూ.. కుటుంబం నుంచి వేరైనా తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరు దెబ్బ తీయలేరంటూ కూడా పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: