సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద డైరెక్షన్లో తలకెక్కిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాను ఫిబ్రవరి 16న రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కాగా రిలీజ్ తర్వాత వాటికి మరింత క్రేజ్ వచ్చింది. సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయి మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే మూడు రోజుల్లో 20 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన భైరవకోన మూవీ లేటెస్ట్ గా నైజాం లో రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది.

నైజాంలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమా నాలుగు రోజుల్లో ఐదు కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది అంటే నైజాంలో ఊరు పేరు భైరవకోన దూసుకెళ్తుందని అర్థం. ఈ సినిమాతో సందీప్ కిషన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ అందుకున్నాడు. సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్న సందర్భం గా చిత్ర సంతోషంగా ఉన్నారు.

విఐ ఆనంద్ తన ఫిక్షనల్ స్టోరీస్ ని ఆడియన్స్ ఎంటర్టైన్  చేసేలా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ఎక్కడికి పోతావు చిన్న వాడా నుండి అతను ఇదే తరహా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్నాడు. సందీప్ కిషన్ తో ఆల్రెడీ టైగర్ సినిమా తీసి హిట్టు అందుకున్న వి ఐ ఆనంద్ ఇప్పుడు మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన హిట్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే జోష్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వి ఐ ఆనంద్ మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు అనిల్ సుంకర.


మరింత సమాచారం తెలుసుకోండి: