అనిల్ రావిపూడి దర్శకత్వం లో భగవంత్ కేసరి అనే సినిమా చేసిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమా ని నందమూరి బాలకృష్ణ 109వ సినిమా గా సంభో దిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సంబంధించిన అనేక ప్రచారాలు తెరమీద కు వస్తూ ఉండగా షూటింగ్ మాత్రం శరవేగం గా పూర్తి చేసే పని లో ఉన్నారు సినిమా యూనిట్. ఇక తాజాగా బాలకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ రెండు నెలల పాటు నటనకు బ్రేక్ తీసుకోబో తున్నారని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగ బోతున్నాయి. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యే గా మళ్ళీ పోటీ చేస్తున్న నేపథ్యం లో తన నియోజకవర్గ ప్రచారం తో పాటు తెలుగుదేశం పార్టీ ఆయన స్టార్ క్యాంపెనర్ గా కూడా వ్యవహ రించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల పాటు పూర్తిగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి ఆయన ఎన్నికల ప్రచారంలో దిగుతున్నట్లు గా తెలు స్తోంది. అందుకోసం రెండు కార్లు కూడా ఆయన సిద్ధం చేశారు. గతంలో తన కుమార్తె బ్రాహ్మణి ఇచ్చిన ఒక కారుతో పాటు మరొక కారుని కూడా ఈ ప్రచారం కోసం నందమూరి బాలకృష్ణ సిద్ధం చేశారు. తాజా గా కార్లకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక నందమూరి బాలకృష్ణ కు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ ఒక కథ చెబితే అది ఆయనకు బాగా నచ్చిందని ఆ సినిమా చేయ డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన క్లారిటీ అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: