కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన యువ హీరోయిన్ ఆశిక రంగనాథ్ తెలుగులో చేసిన మొదటి సినిమా అమిగోస్ డిజాస్టర్ కాగా కొద్దిపాటి గ్యాప్ తో కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగాలో చాన్స్ అందుకుంది. విజయ బిన్నీ డైరెక్షన్లో తెరకెక్కిన నా సామిరంగా మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కొన్నాళ్లుగా నాగార్జున ఎదురు చూస్తున్న మాస్ హిట్గా ఈ మూవీ నిలవడంతో ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఆషికాకు కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.

నా సామి రంగ హిట్ అయిన కూడా అమ్మడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. ఇప్పటికే అమ్మడికి పదుల సంఖ్యలో అవకాశాలు వస్తున్న అమ్మడు మాత్రం వాటిలో నుంచి సెలెక్టర్ సినిమాలను మాత్రమే ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ఆషికా రంగనాథ్ కి మెగా ఆఫర్ వచ్చినట్టు స్టాక్. మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాగా చేస్తున్నారు విశ్వంభర సినిమాలో ఇప్పటికే త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మెగా సినిమా విశ్వంభరలో ఆశిక రంగనాథ్ కూడా ఛాన్స్ అందుకుందని ఫిలింనగర్ టాక్.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. సినిమాలో చిరంజీవికి నలుగురు అక్కాచెల్లెళ్లు ఉంటారని తెలుస్తుండగా ఈ యువ హీరోయిన్స్ ని చిరంజీవి చెల్లెలుగా చేస్తారేమోనని మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. త్రిష ఆల్రెడీ చిరంజీవితో జతకడుతుందని అనౌన్స్ చేయగా సినిమాలో నటించే మిగతా హీరోయిన్స్ గురించి చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ఆషిక ఇద్దరు కూడా విశ్వంభరలో ఉంటే ఆ సినిమాకు ప్లస్ అయినట్టే లెక్క. యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న మెగా విశ్వంభర సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. చిరు సినిమాతో ఆషిక తప్పకుండా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: