సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కానీ… ఒకప్పుడు ఆ హీరోలు, హీరోయిన్లు వందల రూపాయలతో కెరీర్‌ ప్రారంభించినవారే. మహా అయితే వేల రూపాయలతో కెరీర్‌ స్టార్ట్‌ చేసినవాళ్లే.స్టార్‌ స్టేటస్‌ వచ్చాక గతంలో మా తొలి సంపాదన ఇదే అంటూ చెబుతుంటారు. అప్పుడు ఆ విషయాలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా కొత్త పెళ్లి కూతురు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇలా తన తొలి సంపాదన గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ విషయాల గురించే సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ 2009లో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె తొలి సినిమా కన్నడంలో తెరకెక్కిన 'గిల్లి'. ఆ తర్వాత తెలుగులో 'కెరటం' అంటూ ఓ సినిమా చేసింది. అయితే ఆ సినిమా సరైన విజయం అందుకోలేదు. కానీ సందీప్ కిషన్ హీరోగా వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్ నైట్‌ స్టార్‌ స్టేటస్‌ తెచ్చుకుంది. కోట్ల రూపాయాల పారితోషికం ఆమె వంతైంది. తెలుగు, తమిళం, హిందీ అంటూ అన్ని భాషలనూ చుట్టేసింది.అలాంటి రకుల్‌ తొలి పారితోషికం ఎంతో తెలుసా? రూ. 5000. సినిమా పరిశ్రమకు వచ్చాక 25 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మ తోడుగా వచ్చేది అంటూ పాత రోజులు గుర్తు చేసుకున్న రకుల్‌… మోడల్‌గా తన మొదటి సంపాదన రూ. 5 వేలు అని చెప్పింది. అక్కడి నుండే ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చింది. తన సక్సెస్ ఫుల్ జర్నీలో తల్లిదండ్రులు, సన్నిహితుల ప్రోత్సాహం, మద్దతు ఎంతగానో ఉందని అంది. అసలు వాళ్లు లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది అని చెప్పుకొచ్చింది.ఇక రకుల్ ప్రీత్ సింగ్  త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె త్వరలో ఏడడుగులు వేయనుంది. గోవాలో ఫిబ్రవరి 21న వీరి పెళ్లి జరుగనుంది. 2021లో జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు రకుల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆ తర్వాత సుమారు మూడేళ్లకు ఇప్పుడు ఈ లవ్‌ బర్డ్స్‌ ఓ ఇంటివారు కాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: