అల్లు అరవింద్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకి చెయ్యి అందించిన ఈయన మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అదేవిధంగా చిరంజీవిని హీరో చేసే వరకు నిద్రపోకుండా పెద్ద స్టార్ హీరోని చేసి ప్రస్తుతం ఓ పొజిషన్లో నిలబెట్టాడు. ఇక ఈయన పేరును ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ మరియు అల్లు శిరీష్ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక ఎన్నడూ ఏ యాక్టర్ కి రాణి అవార్డుని అల్లు అర్జున్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో బన్నీ యాక్టింగ్ కి గాను నేషనల్ అవార్డు దక్కింది. ఇక దీంతో అల్లు అర్జున్ పేరుతో పాటు అల్లు అరవింద్ పేరు కూడా మారు మోగింది. ఇక తాజాగా ఆలీ షో కి పాల్గొన్న అల్లు అరవింద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గీత అంటే ఎవరు అని ఆలీ ప్రశ్నించగా..” అది కొంతమందికి మాత్రమే తెలుసు.. నాకు గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని డౌట్.. నిజంగానే నాకు గీత అని గర్ల్ ఫ్రెండ్ ఉండేది.దానివల్ల గీత ఆర్ట్స్ నిర్మించలేదు. వేరు వేరు సందర్భాల్లో ఈ రెండిటిని కలిపేసి మాట్లాడుతూ ఉంటారు నా ఫ్రెండ్స్. గీత ఆర్ట్స్ పేరు పెట్టింది మా నాన్నగారు. పెడదామని ప్రపోజల్ పెట్టింది నాతో మా నాన్నగారు. ఎలా అంటే నాకు దాసర సత్యం మూర్తి ఎదురుంగా నాన్నగారు ఓ డిస్కషన్ పెట్టారు. గీత ఆర్ట్స్ పెడితే బాగుంటుంది.. గీత లో ప్రయత్నం మాత్రమే మనది రిజల్ట్ మన చేతులో లేదు అనేది మీనింగ్.. ఇది సినిమాకి బాగా వర్తిస్తది.సినిమా నువ్వు చేసిన రిజల్ట్ వాళ్ళ చేతిలో ఉంది. అని చెప్పడమే కదా అందువల్ల గీతకి దగ్గరగా ఉంది కనుక గీత ఆర్ట్స్ పెడదాం అని నాన్నగారు వెల్లడించారు. దానిని నా గర్ల్ ఫ్రెండ్ ని కలపకండి ” అంటూ కామెంట్స్ చేశాడు అల్లు అరవింద్. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ముసలోడే కానీ మహానుభావుడు. ఎంత వయసు వచ్చినప్పటికీ.. తన ప్రియురాలు పేరు మాత్రం మర్చిపోలేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు

మరింత సమాచారం తెలుసుకోండి: