బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్, సుప్రీత హీరో హీరోయిన్స్ గా త్వరలోనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.కాగా సురేఖ వాణి సెట్స్ లో మెరిసింది. కూతురిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా కాలంగా సురేఖ గట్టి ప్రయత్నాలు చేసింది. సుప్రీత కి కూడా యాక్టింగ్ పట్ల బాగా ఆసక్తి ఉండటంతో .. నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ వంటి కళల్లో నైపుణ్యం పొందాలని ట్రైనింగ్ తీసుకుందట.కెమెరా ముందుకు రాకముందే సోషల్ మీడియాలో సుప్రీత మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తరచుగా హాట్ ఫోటో షూట్లు, డాన్సులు, రీల్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ప్రైవేట్ సాంగ్ కూడా చేసింది. ఇక తాజాగా బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కి జంటగా సుప్రీత నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అమర్, సుప్రీత మీద మొదటి రోజు కొన్ని సీన్లు చిత్రీకరించారు. కాగా కూతురికి ఇండస్ట్రీ కొత్త కావడంతో సురేఖ వాణి దగ్గరుండి చూసుకుంటుంది.హీరోయిన్ మదర్ హోదాలో సెట్స్ లో సురేఖ వాణి సందడి చేస్తుంది. అమర్, సుప్రీత పై చిత్రీకరించిన సీన్లు దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. మోనిటర్ లో ఆ సీన్లు సురేఖ వాణి గమనిస్తున్నట్లు ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. హీరో హీరోయిన్స్ తో పాటు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. సురేఖ వాణి ఆడపాదడదా చిత్రాల్లో నటిస్తుంది. తన కూతురిని వెండితెర పై చూడాలన్న సురేఖ వాణి కల త్వరలో నెరవేరనుంది. దీంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.అమర్ దీప్, సుప్రీతలకు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. దాంతో మూవీతో హిట్ కొట్టి పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఆశలు పెట్టుకున్నారు. సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చిన అమర్ దీప్.. సినిమాలు, డిజిటల్ సిరీస్ లపై దృష్టి పెట్టాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. గతంలో పలు షాట్ ఫిలిమ్స్ లో అమర్ నటించాడు. హీరోగా అమర్ దీప్ మొదటిసారిగా నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: