సౌత్లో సీనియర్బ్యూటీల హవా తగ్గుతున్న వేళ త్రిష మాత్రం తన దూకుడు చూపిస్తోంది. కుర్ర హీరోయన్ల కు సైతం పోటినిచ్చేలా తనను తాను మలుచుకుని బడా ఆఫర్లు కొట్టేస్తోంది.ఇక అంతలోనే తనపై వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.తాజాగా అన్నాడీఎంకే నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిష వ్యక్తిగత జీవితంపైన చాలా చీప్ కామెంట్స్ చేశారు. గతం లో గౌవత్తూరులో త్రిష ఓ ఫంక్షన్ కు అటెండ అయ్యారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే జి.వెంకటాచలం త్రి షపై మనసుపడ్డారు. ఒక్క రోజుకు రూ. 25 లక్షలు చెల్లించి ఆమెతో గడిపారు. అందుకు నేనే సాక్ష్యం అంటూ కామెంట్ చేశారు. ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన రాజు సంచ లన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో త్రిష ఫ్యాన్స్, నెటిజన్లు అంతా సదరు లీడర్‌ను ఏకిపారేశారు.ఇదే విషయంపై త్రిష స్పందిస్తూ..ఛీ వింటేనే చిరాకేస్తుంది..అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యం గా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. అతడిపై న్యాయ పోరాటం చేస్తానని..ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు త్రిష ఎక్స్‌ లో పోస్ట్‌ చేసింది.త్రిష సినిమాల విషయానికి వస్తే..స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ విదా మూయుర్చిలో నటిస్తుంది. అలాగే కమల్..మణిరత్నం థగ్ లైఫ్ చిత్రంతో పాటు..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రామ్ మూవీలో కూడా నటిస్తుంది. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ నేపథ్యంలో డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. వీటితో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్కు త్రిష ఆల్రెడీ సైన్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: