సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరిగా నటించిన 5 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గా వచ్చిన షేర్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

గుంటూరు కారం : మహేష్ బాబు హీరో గా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 111.81 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... శ్రీ లీల , మీనాక్షి చౌదరిమూవీ లో మహేష్ కి జోడి గా నటించారు.

సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరో గా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 110.12 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు.

సరిలేరు నీకెవ్వరు : మహేష్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 138.78 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.

మహర్షి : మహేష్ బాబు హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 104.58 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

భరత్ అనే నేను : మహేష్ బాబు హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 101 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: