రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా దర్శక దీయుడు రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో మన అందరికీ తెలిసిందే. ఇక పోతే ఈ సినిమా కి రాజమౌళి తండ్రి ప్రముఖ కథ రచయిత అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు . ఇక పోతే బాహుబలి మూవీ లో అనేక పాత్రలకి అద్భుతమైన గుర్తింపు లభించింది.

అలా ఈ సినిమా లో అద్భుతమైన ప్రేక్షక ఆదరణ పొందిన పాత్రల్లో కట్టప్ప పాత్ర ఒకటి. ఈ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ నటించాడు . ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు . ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈయనకు అద్భుతమైన గుర్తింపు ఇండియా వ్యాప్తంగా లభించింది . ఇక పోతే తాజాగా బాహుబలి సినిమాకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు ముందు ఎవరిని అనుకున్నాము ..? ఎందుకు అతన్ని తీసుకోలేదు ..?  అనే విషయం పై క్లారిటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ... బాహుబలి సినిమా లోని కట్టప్ప పాత్ర కోసం మొదట ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను అనుకున్నాం . అలాగే ఆ పాత్ర కోసం అతన్ని సంప్రదిం చాలి అని అనుకున్న సమయం లో ఆయన జైల్ లో ఉన్నారు. దానితో సత్య రాజ్ ను ఆ పాత్ర కోసం సంప్రదించాం. ఆయన కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు తాజా ఇంటర్వ్యూ లో విజయంద్ర ప్రసాద్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: