బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటుడు ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా లలో నటించి అద్భుతమైన గుర్తింపు ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు . ఇక పోతే ఈ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు . అందులో భాగంగా తనకు "బ్లూ" సినిమా సమయం లో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు  . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ... నేను బ్లూ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు నాకు ఒక అరుదైన సంఘటన ఎదురైంది.

సముద్రంలో యాక్షన్ సన్నివేశం చేసే సమయం లో సొర చేపలు తన వెంట పడ్డట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు . సముద్రం లో 150 అడుగుల లోతులో స్టంట్ సన్నివేశం చేస్తున్నప్పుడు నాకు గాయమై రక్తం వచ్చింది . ఆ సమయం లో పదుల సంఖ్యలో సొర చేపలు నా చుట్టూ చేరాయి . అవి నన్ను తినేస్తాయేమోనని భయపడ్డా . వాటి నుండి తప్పించుకొని సురక్షితం గా బయట పడ్డాను అని అక్షయ్ కుమార్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే అక్షయ్ కుమార్ హీరో గా రూపొందిన బ్లూ సినిమా 2009 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో సంజయ్ దత్ , లారా దత్ , కత్రినా కైఫ్ ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ప్రస్తుతం అక్షయ్ కుమార్ అనేక క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: