తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు కార్తీక్ దండు. దర్శకత్వంలో రూపొందుల విరూపాక్ష అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇకపోతే విరూపాక్ష లాంటి సూపర్ సక్సెస్ తర్వాత ఈయన సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాకు బడ్జెట్ భారీగా అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని ఈ చిత్ర బృందం వారు ఆపివేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ వారు ఈ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ ను పెట్టకూడదు అని సూచించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వేరే టైటిల్ తో తెరకెక్కించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వేరే టైటిల్ తో చిత్రీకరించాలని అలాగే ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులు అయినటువంటి పూజా హెగ్డే , నీది అగర్వాల్ ను హీరోయిన్ లుగా తీసుకోవాలి అని డిసైడ్ అయినట్లు అందులో భాగంగా ప్రస్తుతం ఈ చిత్ర బృందం వారు ఈ ఇద్దరు ముద్దు గుమ్మలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక వేళ విరు కనుక ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

St